




.jpg)




Mulkanoor Praja Granthalayam
సమాజంలో అసమానతలు తగ్గాలన్నా.. ప్రతి మనిషీ ఆత్మగౌరవంతో జీవించాలన్నా... విద్యతోనే సాధ్యమని నమ్మి, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం స్థాపించడం జరిగింది. అజ్ఞానపు చీకట్లను పారదోలడమే కాదు, దురలవాట్లకు దూరంగా యువతను నడపాలని, యువతలో నిగూఢంగానున్న అద్భుతమైన శక్తి సామర్థ్యాలను వెలి కి తీసి, కుటుంబానికి, సమాజానికి గొప్ప మానవవనరులను అందించాలనే ఈమహా యజ్ఞంలో మాకు లభించిన సప్త నిధులు ఇవి..
ముల్కనూరు
ప్రజా గ్రంథాలయం
జ్ఞానం
జ్ఞాన సముపార్జన కేవలం పాఠశాల గదులకే పరిమితం కాదు. జీవితాంతం సాగే నిరంతర ప్రవాహం. నేటి వేగవంతమైన ప్రపంచంలో, నిత్యం కొత్త విషయాలు నేర్చుకోవడం తప్పనిసరి. అలాంటి జ్ఞానార్జనకు ఈ గ్రంథాలయం ఒక పవిత్రమైన ఆలయం. ఇది కేవలం పుస్తకాల కొలువు కాదు, ఆలోచనలకు, ఆవిష్కరణలకు నెలవు.
సాధన
ఏ లక్ష్యానికైనా పునాది సాధన. నిరంతర ప్రయత్నం, ఓర్పు, అంకితభావం.. ఇవి మూలధనం. ఈ లక్షణాలు ఉన్నవారికి విజయం తథ్యం. ఆ పట్టుదలతో కూడిన ప్రయాణంలో మా గ్రంథాలయం ఒక తోడుగా నిలుస్తుంది. ఇది కేవలం సమాచార కేంద్రం కాదు, ఉద్యోగార్థుల కలలను సాకారం చేసే శక్తి కేంద్రం.
విజయం
ఈ ఆవరణలో భావి తరాల ఆశల ఆనవాళ్లు నిక్షిప్తమై ఉన్నాయి. కాలంతో సంబంధం లేకుండా.. ఇక్కడి అక్షర జ్యోతుల వెలుగుల్లో రేపటి తరానికి దారి కనిపిస్తోంది. యువత తామెంచుకున్న ప్రయాణంలో విజయానికి తమవంతు తోడైందీ మన ప్రజా గ్రంథాలయం.
.jpg)

_JPG.jpg)

_jfif.jpg)
_edited.jpg)

.jpg)
జ్ఞానభూమిలో సప్త నిధులు
గ్రంథాలయ జ్ఞాన భూమిలో మహోన్నత కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడు కార్యక్రమాలు సప్త నిధులుగా భవిష్యత్తు తరాలకు తిరుగులేని సంపదగా మారతాయని విశ్వసిస్తున్నాం. సమాజానికి జ్ఞానాన్ని, నైపు ణ్యాలను, సంస్కృతిని అందించేందుకు మేము చేస్తున్న కృషికి నిదర్శనాలుగా భవిష్యత్ తరాల ముందు ఉండనున్నాయి.