Badri-Narsan

స్వపరిచయం:

రచయితగా, కాలమిస్టుగా చిరపరిచితులైన బద్రి నర్సన్ స్వస్థలం జగిత్యాల.

ప్రస్తుతం హైదరాబాదులో నివాసముంటున్నారు. డిగ్రీ వరకూ జగిత్యాలలోనే విద్యాభ్యాసం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ, ఎంఎడ్ చేశారు. పాఠశాల స్థాయి నుంచే సాహిత్యాభిలాషను పెంచుకున్నారు.

బాల్య స్నేహితులతో కలిసి ‘సాహితీ మిత్ర దీప్తి’ అనే సంస్థ ద్వారా కవితల పోటీలు నిర్వహించారు. ఎంపికైన రచనలను పుస్తకాల రూపంలోకి తెచ్చారు. ఓయూలో చదువుతున్న రోజుల్లోనే ‘రంగుల కల’, ‘విముక్తి కోసం’ సినిమాలకు రచన, దర్శకత్వ శాఖల్లో పనిచేశారు.

ఉన్నత విద్యాభ్యాసం తర్వాత తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగంలో చేరారు. 2015లో పదవీ విరమణ పొందారు. పదేండ్లుగా సమకాలీన అంశాలపై వివిధ పత్రికలకు విశ్లేషణాత్మక వ్యాసాలు రాస్తున్నారు. దివంగత కవి, చిత్రకారుడు అలిశెట్టి ప్రభాకర్ కవిత్వాన్ని పుస్తకంగా తెచ్చారు.

 

కథలు:

తన జీవితంలో అత్యంత సంతృప్తిని ఇచ్చిన అంశం ఇదేనని నర్సన్ చెప్తారు. సాహిత్యంపై మక్కువతో 30 వరకూ కథలు రాశారు. అందులో ఎనిమిదింటికి వివిధ పోటీల్లో బహుమతులు అందుకున్నారు.

‘ఓ రైతు కథ’కు 2016లో నోముల సత్యనారాయణ పురస్కారం దక్కింది. 2017, 2019లలో ‘నవ తెలంగాణ’ పత్రిక నిర్వహించిన కథల పోటీల్లో ద్వితీయ, తృతీయ బహుమతులను గెల్చుకున్నారు. 2020లో నిర్వహించిన ‘పాలపిట్ట-శకుంతల జైనీ’ దసరా కథల పోటీల్లో ‘రబ్బరు బొమ్మ’ కథకు మొదటి బహుమతి లభించింది.

ముల్కనూర్ గ్రంథాలయం – నమస్తే తెలంగాణ సంయుక్త నిర్వహణలో జరుగుతున్న వార్షిక కథల పోటీల్లో

2020లో ‘కర్మకాండ’ కథకు విశిష్ట బహుమతి,

2021లో ‘జీవన తీరాలు’ కథకు రూ.1,000 బహుమతి,

2022లో ‘మూడు స్తంభాలాట’ కథకు విశిష్ట బహుమతి పొందారు.