Competition-2021

కథల పోటీ - 2021

2019, 2020 సంవత్సరాలలో ముల్కనూరు ప్రజాగ్రంథాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక కథల పోటీలు 2021 నుంచి ముల్కనూరు సాహితీ పీఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి.

 

ముల్కనూర్ ప్రజా గ్రంథాలయానికి అనుబంధంగా సాహితీ సేవ కోసం ముల్కనూర్ సాహితీ పీఠం ఏర్పడింది. తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా కథ సాహిత్యానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ పీఠం ఏర్పడింది. ఈ పీఠానికి గౌరవాధ్యక్షుడిగా శ్రీనివాసులు వేముల ఉన్నారు. ప్రజాగ్రంథాలయపు కార్యవర్గం ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు.

 

కథల పోటీ ప్రకటన 2021 అక్టోబర్ 20న వెలువడింది. చివరి తేదీ నవంబర్ 15. ఈ స్వల్ప వ్యవధిలోనే 600 కథలు వచ్చినాయి. ఫలితాలు 2022 మార్చి 1న ప్రకటించినారు. కథల ప్రచురణ 2022 ఏప్రిల్ 3 నుంచి మొదలైంది. బహుమతి ప్రదానోత్సవం 2022 జూన్ 26న, ముల్కనూరు ప్రజాగ్రంథాలయంలో జరిగింది. ఉదయం 11 గంటలకు పరిచయ కార్యక్రమంతో మొదలై, రచయితల ఇష్టాగోష్ఠి, భోజనాలైన తర్వాత బహుమతి ప్రదానం జరిగింది.

న్యాయ నిర్ణేతలు:

పెద్దింటి అశోక్ కుమార్,  గింజల మధుసూదన్ రెడ్డి,  దేవరాజు విష్ణువర్ధన్ రాజు,  కొమఱ్ఱాజు అనంత కుమర్,  కోడూరి విజయకుమార్,  గోగు శ్యామల.

స్పాన్సరర్స్:

గింజల నరసింహా రెడ్డి, మల్రాజు జనార్ధన్ రావు, మాడుగుల రంగారావు