Chandu-Tulasi

సంక్షిప్తంగా:

 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, మహిళల జీవితాలే చందు తులసి కథలకు ప్రధాన ఇతివృత్తాలు.

జీవిత సహచరి ‘తులసి’ పేరుతో కలిపి ‘చందు తులసి’గా కథలు రాస్తుంటారు పి. చంద్రశేఖర్‌.

స్వస్థలం సూర్యాపేట జిల్లా బండమీది చందుపట్ల. హైదరాబాద్‌లో నివాసం.

వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ప్రవృత్తిరీత్యా కథకుడు. ఈయన మొదటి కథ ‘ఊరవతల ఊడలమర్రి’. 2015లో రాసిన ఈ కథ పాఠకుల మన్ననలు పొందింది.

‘నమస్తే తెలంగాణ – బతుకమ్మ’ సంచికలో వచ్చిన ‘పాలపిట్టల పాట’ కథ నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ యువ కథా సంకలనానికి ఎంపికైంది. వివిధ భారతీయ భాషల్లోకీ అనువాదమైంది.

తల్లిగారిల్లు, నీళ్లబిందె, బతుకమ్మ పుట్టింది లాంటి కథలు గుర్తింపు పొందిన కథా సంకలనాలకు ఎంపికయ్యాయి.

గతంలో గడి, తక్కెడ, మోదుగుపువ్వు కథలకు ‘ముల్కనూరు ప్రజాగ్రంథాలయం – నమస్తే తెలంగాణ’ కథల పోటీల్లో బహుమతులు అందుకున్నారు.

సవివరంగా:

చందు తులసి అసలు పేరు చంద్రశేఖర్. సూర్యాపేట సమీపంలోని బండమీద చందుపట్ల స్వగ్రామం.

పుట్టిన సంవత్సరం: 1982

తల్లిదండ్రులు: ఎల్లమ్మ, వెంకన్న

వ్యవసాయ కుటుంబం

సైకాలజీలో పీజీ చేసి ఉపాధ్యాయ వృత్తిలో హైదరాబాద్ పని చేస్తున్నారు. ఈనాడు టెలివిజన్ లో కొంతకాలం జర్నలిస్టుగా పని చేశారు. జీవిత సహచరి తులసి పేరుతో కలిపి చందు తులసి పేరుతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, మహిళల జీవితాలను ప్రధాన ఇతివృత్తాలుగా తీసుకుని కథలు రాస్తుంటారు. సహచరి తులసి చందు కూడా జర్నలిస్టు. యూట్యూబ్ ఛానెల్ ద్వారా సామాజిక అంశాలపై చర్చ చేస్తుంటారు.

చందు తులసి సినిమా రంగంలో కూడా రచయితగా పని చేస్తున్నారు. తుపాకీ రాముడు, హృదయాంజలి సినిమాలకు పనిచేశారు. పలు పత్రికల్లో కథా సమీక్షలు జరిపారు. ‘సారంగ’ వెబ్‌ పత్రికలో ‘రేపటి కథ’ శీర్షికన అనేకమంది యువకథకుల పరిచయాలు నిర్వహించారు.

 

మొదటి కథ ఊరవతల ఊడలమర్రి మంచి గుర్తింపు తెచ్చింది. కథా సాహితితో పాటు ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన 70 ఏళ్ళ తెలంగాణ కథ ‘మూడుతరాల తెలంగాణ కథ’ సంకలనానికి ఎంపికైంది.

నమస్తే తెలంగాణా ఆదివారం అనుబంధం బతుకమ్మలో వచ్చిన పాలపిట్టల పాట కథ నేషనల్ బుక్ ట్రస్ట్ కథా సంకలనానికి ఎంపిక అవడమే కాకుండా 22 భారతీయ భాషల్లోకి అనువాదం అయింది.

బతుకమ్మ పుట్టింది కథకు గుమ్మళ్ళ లక్ష్మీ ప్రసాద్ అవార్డు లభించింది.

 

తల్లిగారిల్లు, ‘బుక్కెడు బువ్వ’, నీళ్ళబిందె, బతుకమ్మ పుట్టింది లాంటి కథలు పలు గుర్తింపు పొందిన కథాసంకలనాలకు ఎంపిక అయ్యాయి.

 

గతంలో గడి, తక్కెడ, కథలకు ముల్కనూరు – నమస్తే తెలంగాణా కథల పోటీల్లో కన్సొలేషన్ బహుమతి రాగా మోదుగుపువ్వు కథకు 2022లో ద్వితీయ బహుమతి అందుకున్నారు.

 

ఇప్పటి వరకు రాసిన కథలు:

 

ఊరవతల ఊడలమర్రి

పాలపిట్టల పాట

పిట్టకథ

బుక్కెడు బువ్వ

రంగురెక్కల… వర్ణపిశాచం

తల్లిగారిల్లు

నీళ్ళబిందె

ఫార్ములా ఆఫ్ ది టైం మెషీన్

వేకువ పాట

గడి

తక్కెడ

మారు మనుం

బతుకమ్మ పుట్టింది

మోదుగుపువ్వు

పెద్ద బతుకమ్మ

కాటుకపూల బతుకమ్మ