Madderla Ramesh

సంక్షిప్తంగా:

డబ్బు కోసం, వైభోగం కోసం కన్నతల్లి లాంటి భూమిని అమ్ముకోవద్దని, ఈ విషయం రైతుల హృదయాలకు చేరాలనే లక్ష్యంతోనే ‘ఇసప్పురుగు’ కథ రాశానని అంటున్నారు రచయిత డాక్టర్‌ మద్దెర్ల రమేశ్‌. మహబూబాబాద్‌కు చెందిన రమేశ్‌ 26 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ పట్టా పొందారు. సాహిత్యాభిలాషతో సామాజిక స్పృహ కలిగిన కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 13 కథలు ప్రచురితమయ్యాయి. ఆసరా, అమ్మ పెట్టిన భిక్ష కథలు విమర్శకుల ప్రశంసలతోపాటు పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాయి. 2017లో ‘ఉత్తమ కవి రచయిత’గా ప్రభుత్వ పురస్కారం అందుకున్నారు. మారసం (మానుకోట రచయితల సంఘం) పేరుతో సాహితీ సంస్థను స్థాపించి వివిధ సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సవివరంగా:

స్వస్థలం: మహబూబాబాద్

పుట్టిన తేదీ: 9-3-1968

కుటుంబం: తల్లిదండ్రులు రాజయ్య – జయలక్ష్మి. భార్య సరోజినీదేవి, కొడుకులు వశిష్ఠ, వరుణ్ తేజ్

విద్యార్హత: ఎం.ఏ., ఎం.ఫిల్, పిహెచ్ డి.

వృత్తి: ప్రభుత్వ ఉపాధాయుడు (తెలుగు పండిత్), కవి, రచయిత, వ్యాఖ్యాత, క్విజ్ మాస్టర్

రచనలు: 

  1. డా. యం.వి. తిరుపతయ్య జీవన సమరం పరిశీలన (ఎం.ఫిల్. సిద్ధాంత వ్యాసం)
  2. లింగంపల్లి రామచంద్ర సాహిత్యానుశీలన (పిహెచ్ డి సిద్ధాంత వ్యాసం)
  3. మళ్లీ మళ్లీ ఉదయిస్తాను (వచన కవిత్వం)
  4. ‘ముద్దు పలుకు’ శతకం (పద్య రచన)
  5. మానుకోట మణిహారం (మహబూబాబాద్ జిల్లా చరిత్ర, సంస్కృతి, సాహిత్యం)
  6. ఆసరా (కథల సంపుటి) ముద్రణలో
  7. మహబూబాబాద్ జిల్లా సాహిత్య చరిత్ర (తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణ)

 

ఆసక్తి: తెలుగు సాహిత్యం, చరిత్ర పరిశోధన, చారిత్రిక ప్రదేశాల పర్యటన

 

పురస్కారాలు:

  1. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు
  2. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా ఉత్తమ కవి, రచయితగా గుర్తించి 2017 జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ. 51, 116 నగదు పురస్కారం
  3. ముల్కనూరు ప్రజాగ్రంథాలయం సాహిత్యపీఠం, నమస్తే తెలంగాణ దినపత్రిక కథల పోటీ – 2022లో ద్వితీయ బహుమతి రూ. 25,000 నగదు పురస్కారం
  4. ఇతర సంస్థల అనేక పురస్కారాలు
  5. వందకు పైగా సన్మానాలు

 

కథానిలయంలో మద్దెర్ల రమేశ్ కథలు