Ranganath-Sudarsanam

స్వపరిచయం:

రచయిత రంగనాథ్‌ సుదర్శనం స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు. ఎం.ఎ (సమాజ శాస్త్రం) చదివారు. సింగరేణిలో అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. 2019 నుంచి కథలు రాస్తున్నారు. ఇప్పటివరకు 86 కథలు రాశారు. మొదటి కథ.. ‘నవ్వులపాలైన పెళ్లి’ గోతెలుగు వెబ్‌ మ్యాగజైన్‌లో ప్రచురితమైంది. ఆ తరువాత రాసిన చాలా  కథలు గోతెలుగు, సహరి, హాస్యానందం, జాగృతి, తపస్వీ మనోహరం, మన తెలుగు కథలు, సుకథ వంటి వివిధ మాధ్యమాల్లో ప్రచురితమయ్యాయి. ‘ఉరిమెళ్ల ఫౌండేషన్‌ అక్షరాల త్రోవ’ నిర్వహించిన రెండు తెలుగు రాష్ర్టాల స్థాయి కథల పోటీలో ‘ఎక్కిరింపు’ కథకు మొదటి బహుమతి అందుకున్నారు. గోదావరి రచయితల సంఘం వారు నిర్వహించిన కార్డ్ సైజ్ కథల పోటీలో ‘దేవుడు పారి పోయాడు’కు ద్వితీయ బహుమతి వచ్చింది.

పంచమ కుసుమం వారు నిర్వహించిన కథల పోటీలో ‘దేవుని చెట్టు’కు ద్వితీయ బహుమతి, కథా తోరణం వారు నిర్వహించిన కథల పోటీలో ‘రథం ముగ్గు’కు ద్వితీయ బహుమతి వచ్చినాయి, దీపావళి కథల పోటీలో ఇదే సంస్థ నుండి ‘బాల బంధువులు’ కథకు మొదటి బహుమతి వచ్చింది. ప్రతిలిపి వారి కథల పోటీలో ‘లోకం పోకడ’కు ద్వితీయ బహుమహుమతి వచ్చింది. అలాగే ‘గ్రహణం విడిచింది’ కథకు జాగృతి వారి ప్రత్యేక బహుమతి, ‘దీపారాధన’ కథకు హాస్యానందం కథల పోటీలో బహుమతి వచ్చినాయి.