Raviteja-Siripuram

సంక్షిప్తంగా:

రవితేజ సిరిపురం, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలంలోని రామారావుపేట్ గ్రామంలో 1996లో వాణి – పోశం సిరిపురం దంపతులకు జన్మించారు. 

దిగువ మధ్య తరగతి కుటుంబం. వర్ధమాన స్వతంత్ర ఫిలిం మేకర్. చదివింది ఇంజనీరింగ్ అయినా చిన్నప్పటి నుండి సినిమాల మీద ఉన్న మక్కువతో మొదట ఒక న్యూస్ ఛానల్లో యాంకర్‌గా, వీడియో ఎడిటర్‌గా పని చేసి, ఆ తర్వాత వై మీ? మరియు నయా బ్రేకప్ అనే లఘు చిత్రాలలో నటించి, దర్శకత్వ శాఖలో కూడా పని చేశారు. 

2 సినిమాలకు కథనం రాయడంలో ఫ్రీలాన్సింగ్ చేశారు. తర్వాత కలవా..? చెలియా..! అనే లఘు చిత్రాన్ని క్రౌడ్ ఫండింగ్‌తో నిర్మించి, దాంట్లో నటన మరియు దర్శకత్వం చేశారు. 

దానికి ఉత్తమ చిత్రం, స్క్రీన్ ప్లే కేటగిరిల్లో అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులతో పాటు అనేక చలన చిత్రోత్సవాల్లో వివిధ విభాగాల్లో గుర్తింపు వచ్చింది. ఇంకా చాలా చలన చిత్రోత్సవాల్లో ఎక్సిబిషన్ మరియు ఆఫిషియల్ స్క్రీనింగ్ ఆమోదం పొందింది.

 

 
 

రవితేజ శ్యామిక, అమ్మ I miss you, ఫాదర్స్ డే, మరికొన్ని కొన్ని లఘు చిత్రాలకు వాయిస్ ఆర్టిస్ట్ గా కూడా పని చేశారు. ఆన్లైన్ లో స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ మరియు మీరా నాయర్ మాస్టర్ క్లాస్, మరియు ఐ.ఐ.టి. మద్రాస్ నుండి ఫిలిం అప్రిసియేషన్ మరియు దర్శకత్వంలో మాస్టర్ క్లాస్ లో సర్టిఫికేషన్ కోర్సులు చేసి ఉన్నారు. 

తనే యాక్టింగ్, క్రౌడ్ ఫండింగ్ తో ప్రొడ్యూస్, ఎడిటింగ్ మరియు దర్శకత్వం చేసిన ప్రామాద్య అనే డెమో ఫిలిం విడుదలకు సిద్ధంగా ఉంది. ఒక డాక్యు డ్రామా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని షూటింగుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. 

చెప్పాలని ఉన్న అన్ని కథలనూ సినిమా లాగా చెప్పే ఆర్ధిక స్తోమత లేక వాటిని కథల రూపంలో చెప్పడానికి నిశ్చయించుకుని ఇప్పటి వరకు రాసిన మొదటి, ఒకే ఒక కథ బతుకును అమ్ముడు సావును కొనుడు. ఇంకా ఇలాగే చాలా కథలను రాయడానికి మీ ప్రోత్సాహాన్ని కోరుకుంటున్నారు.