సంక్షిప్తంగా:
తనను కదిలించే జీవితాలు, సంఘర్షణకు గురిచేసే సంఘటనలే స్ఫూర్తి కందివనం కథలకు ప్రేరణ. స్వస్థలం మహబూబ్ నగర్. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. బయోటెక్నాలజీలో పీజీ చేసి సైంటిఫిక్ ఈ-జర్నల్స్ పబ్లిషింగ్ సంస్థల్లో మేనేజింగ్ ఎడిటర్‌గా కొన్నాళ్లపాటు పనిచేశారు స్ఫూర్తి. సాహిత్యాభిలాషతో 2019 నుండి రచనారంగంలోకి వచ్చారు. ఇప్పటివరకు 30కి పైగా కథలు, 3 నవలలు రాశారు. ఆంగ్లంలో కూడా కొన్ని కథలు రాశారు.
స్ఫూర్తి తొలి నవల ‘చైత్ర’కు ‘తెలంగాణ సారస్వత పరిషత్తు యువ పురస్కారం’, ‘అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్ ప్రథమ నవలా పురస్కారం’ అందుకున్నారు. నమస్తే తెలంగాణ – ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా ప్రతి ఏటా నిర్వహించే కథల పోటీల్లో 2020లో ‘చీకటి వెలుగులు’ కథకు విశిష్ట బహుమతి, 2021లో ‘డిమ్కి’ కథకు ప్రథమ బహుమతి, 2022లో ‘ముసురు’ కథకు తృతీయ బహుమతి అందుకున్నారు. అంతేకాకుండా, ఈనాడు, పాలపిట్ట, అర్చన ఫైన్ ఆర్ట్స్, అరసం వంటి సాహితీ సంస్థలు, పత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో ఆమె కథలకు బహుమతులు అందుకున్నారు.
‘చీకటి వెలుగులు’, ‘నాయిన చెప్పిన అబద్ధం’, ‘డిమ్కి’, ‘నల్ల చీమలు’, ‘ముసురు’ కథలు కథా రచయిత్రిగా ఆమెకు మంచి గుర్తింపునిచ్చాయి. ‘చీకటి వెలుగులు’ కథ రచయిత వేంపల్లి షరీఫ్ సంపాదకత్వంలో వెలువడిన ‘యువ 40’, ‘తీర్పు’ కథ అచ్చంగా తెలుగు ప్రచురణలు ‘క్షీరసాగరంలో కొత్త కెరటాలు’ కథా సంకలనాలకు ఎంపికయ్యాయి.
2023 జూలైలో ‘శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్’ ద్వారా ఆమె తొలి కథా సంపుటి ‘డిమ్కి’ వెలువడింది.
సవివరంగా:
స్వస్థలం: మహబూబ్ నగర్
ప్రస్తుత నివాసం: హైదరాబాద్
పుట్టిన తేదీ: 20-05-1987
విద్యార్హత: ఎం. ఎస్సి. బయోటెక్నాలజి
కుటుంబం: తల్లిదండ్రులు – కందివనం రఘురామయ్య, కందివనం వరలక్ష్మి. భర్త పి.నరేంద్రకుమార్, కొడుకు సాయి యువన్.
సాహిత్యంలోకి రావడానికి ప్రేరణ: తండ్రి కందివనం రఘురామయ్య పాత్రికేయ వృత్తిలో ఉండడం వల్ల అక్షరాలతో ఆయనకున్న సావాసాన్ని ఊహ తెలిసినప్పటి నుండి ప్రత్యక్షంగా చూస్తూనే పెరిగారు స్ఫూర్తి. తండ్రి, తాతయ్య ఇద్దరూ పుస్తక ప్రియులే కావడం, ఇంట్లో వందలకొద్దీ పుస్తకాలు ఉండడం, నానమ్మ, అమ్మమ్మలు వాళ్ళ చిన్ననాటి ముచ్చట్లు, గతంలో జరిగిన సంఘటనలను, రోజువారీ సంగతులను నేర్పుగా, అమితాసక్తిగా చెబుతుంటే వినడం, తల్లి వరలక్ష్మి చెప్తుండే కథలు వినడం… వీళ్ళందరి ప్రభావం తనపై ఖచ్చితంగా ఉండే ఉంటుందని, బహుశా అదే తనను సాహిత్య రంగం వైపు లాక్కొచ్చి ఉంటుందని స్ఫూర్తి అభిప్రాయం.
రాయడం మొదలుపెట్టింది: 2019 నుంచి.
ఇప్పటి వరకు రాసిన కథలు: ఆంగ్లంలో కొన్ని కథలు, తెలుగులో ముప్ఫైకు పైగా కథలు, మూడు నవలలు. కథలు నమస్తే తెలంగాణ, ఈనాడు, సారంగ, విశాలాక్షి, విశాలాంధ్ర, సాహితీ కిరణం, లోగిలి, రమ్యభారతి పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
‘చీకటి వెలుగులు’, ‘నాయిన చెప్పిన అబద్ధం’, ‘డిమ్కి’, ‘నల్ల చీమలు’, ‘ముసురు’ కథలు కథా రచయిత్రిగా ఆమెకు మంచి గుర్తింపునిచ్చాయి. ‘చీకటి వెలుగులు’ కథ రచయిత వేంపల్లి షరీఫ్ సంపాదకత్వంలో వెలువడిన ‘యువ 40’, ‘తీర్పు’ కథ అచ్చంగా తెలుగు ప్రచురణలు ‘క్షీరసాగరంలో కొత్త కెరటాలు’ కథా సంకలనాలకు ఎంపికయ్యాయి. 2023 జూలైలో ‘శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్’ ద్వారా ఆమె తొలి కథా సంపుటి ‘డిమ్కి’ వెలువడింది.
వెలువడిన పుస్తకాలు:
- చైత్ర (నవల)
- డిమ్కి (కథలు)
పురస్కారాలు:
- తెలంగాణ సారస్వత పరిషత్తు యువ పురస్కారం – 2022 (తొలి నవల ‘చైత్ర’కు)
- అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్ ప్రథమ నవలా పురస్కారం – 2021
- మువ్వా పద్మావతి ఫౌండేషన్ నవ స్వరాంజలి పురస్కారం – 2022
బహుమతులు:
- నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీ పీఠం సంయుక్తంగా నిర్వహించిన ‘కథ 2022’ పోటీలో ‘ముసురు’ కథకు తృతీయ బహుమతి.
- శ్రీ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్-పాలపిట్ట మాస పత్రిక సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2023లో ‘నల్ల చీమలు’ కథకు ప్రత్యేక బహుమతి.
- నమస్తే తెలంగాణ – ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘కథ 2021’ పోటీలో ‘డిమ్కి’ కథకు ప్రథమ బహుమతి.
- అరసం – విశాలాంధ్ర సంయుక్తంగా నిర్వహించిన ‘అరసం యువ కథా పురస్కారం 2021’ కథల పోటీలో ‘నేను… మీ…!’ కథకు ప్రత్యేక బహుమతి.
- రామోజీ ఫౌండేషన్ – ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కథా విజయం 2020’ కథల పోటీలో ‘నాయిన చెప్పిన అబద్ధం’ కథకు ప్రత్యేక బహుమతి.
- అర్చన ఫైన్ ఆర్ట్స్ ‘పడతీ నీవెవరు!’ కథల పోటీ 2021లో ‘ఇంకా ఎందుకీ భయాలు?’ కథకు ప్రత్యేక బహుమతి.
- నమస్తే తెలంగాణ – ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘కథ 2020’ పోటీలో ‘చీకటి వెలుగులు’ కథకు విశిష్ట బహుమతి.
- లోగిలి మాస పత్రిక నిర్వహించిన సింగిల్ పేజీ కథల పోటీలో ‘సత్యవతి హ్యాండ్లూమ్స్’ కథకు తృతీయ బహుమతి.
ఈ-మెయిల్: k [dot] spoorthy20 [at] gmail [dot] com