స్వపరిచయం:
శ్రీదేవీ శ్రీకాంత్:
క్లినికల్ సైకాలజిస్ట్‌గా పనిచేస్తూనే రచయిత్రిగా, కవయిత్రిగా, నృత్యకారిణిగా, చిత్రకారిణిగా, సమీక్షకురాలిగా బహుముఖ ప్రజ్ఞ చాటుతున్నారు డాక్టర్ శ్రీదేవీ శ్రీకాంత్. వీరి స్వస్థలం హైదరాబాద్. ప్రస్తుతం ఆఫ్రికాలోని బోట్స్‌వానా దేశంలో నివాసం ఉంటున్నారు.
ఐదు పీజీలు, రెండు పీహెచ్‌డీలు (క్లినికల్ సైకాలజీ, ట్రాన్స్‌లేషన్ స్టడీస్) చేశారు. 200కు పైగా కథలు రాశారు. వీరి కలం నుంచి తెలుగు, హిందీ, ఆంగ్లంలో 800లకు పైగా గజల్స్ జాలువారాయి. ఆయా భాషల్లో పాటలు, భక్తి పాటలు, జానపద పాటలు, కవితలు, పద్యాలు, తత్వాలు, నాటికలు, నానీలు, హైకూలు, వ్యాసాలు తీసుకొచ్చారు. మూడు నవలలు, నాలుగు సైకాలజీ పుస్తకాలు, రెండు గేయ కావ్యాలను వెలువరించారు.
చిత్ర లేఖనం, రాక్ పెయింటింగ్, వాల్ ఆర్ట్‌లో ప్రవీణురాలు. కూచిపూడి, భరతనాట్యంతోపాటు వీణావాద్యంలోనూ ప్రవేశం ఉన్నది. నాటకాలు, నృత్యం, వక్తృత్వ, చిత్రలేఖన పోటీల్లో అనేక బహుమతులు అందుకున్నారు. ఎన్నో సన్మానాలు, బహుమతులు చిన్నప్పటి నుండి పొందారు. రేడియోలో అనేక కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. కథలపై లోతైన సమీక్షలు చేస్తారు. అనేక తెలుగు సాహిత్యం, క్లినికల్ సైకాలజీ సమావేశాల్లో పత్ర సమర్పణ చేశారు. హిందీ, ఆంగ్లం, తమిళ, కన్నడ, మలయాళం భాషలలో ప్రావీణ్యం ఉంది.
మొక్కలు పెంపకం, బొమ్మలు చేయడం ఇష్టం.
ఆటల్లో షటిల్ ఇష్టం.
రుచిగా వంట చేయడం ఇష్టం.
నమస్తే తెలంగాణా కథల పోటీలో గెలవడం అత్యంత గౌరవంగా భావిస్తున్నారు.
ముల్కనూరు సాహితీ పీఠం – నమస్తే తెలంగాణ కథల పోటీ 2021లో బతుకమ్మ కథకు రూ. 5 వేల బహుమతి,
ముల్కనూరు సాహితీ పీఠం – నమస్తే తెలంగాణ కథల పోటీ 2022లో ప్రసవం ఓ ప్రణవం కథకు విశిష్ట కథకులుగా గుర్తింపు పొందారు.