Suguna Rao

రచయిత పేరు: డాక్టర్‌ ఎమ్‌. సుగుణరావు

పుట్టిన తేదీ: 1961 జూన్ 10

స్వస్థలం: నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా

స్థిరపడింది: విశాఖపట్నం

అమ్మా నాన్నలు: శ్రీమతి చక్రమ్మ, శ్రీ కృపాధానం 

విద్యార్హతలు: వెటర్నరీ సైన్సులో మాస్టర్స్‌ డిగ్రీ

ఉద్యోగం: భారత ప్రభుత్వరంగ బీమా సంస్థ నుండి సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్‌ స్థాయి అధికారిగా పదవీ విరమణ

ఎప్పటి నుండి కథలు: దాదాపు ముప్ఫయ్యేళ్ళుగా రాస్తున్నారు

ఇప్పటి వరకు రాసిన కథలు: దాదాపు మూడొందల కథలు పైచిలుకు రాసారు.

వాటిలో 100 కథలకు బహుమతులు వచ్చాయి. 

స్వాతి, నవ్య, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, రచన, నవ తెలంగాణా, జాగృతి, విశాలాక్షి, సారంగ, విశాఖ సంస్కృతి మొదలైన పత్రికలలో కథలు ప్రచురించబడినాయి.

ఇప్పటి వరకు వెలువరించిన కథా సంపుటులు:

  1. జాబిలి మీద సంతకం
  2. నేలకు దిగిన నక్షత్రం
  3. ఆకాశంలో ఒక నక్షత్రం
  4. సుగుణ కధాభిరామం డా. ఎమ్. సుగుణరావు బహుమతి కథలు 

గుర్తింపు తెచ్చిన కొన్ని కథల పేర్లు:

  1. ఆకాశంలో ఒక నక్షత్రం – ఉపాధ్యాయ మాసపత్రికలో బహుమతి పొందిన ఈ కథ ఇండియన్‌ ఎన్‌సాంబుల్‌ ద్వారా ఇంగ్లీషు నాటకంగా రూపుదిద్దికుంది. బొంబాయి టాటా లిటరేచర్ ఫెస్ట్, సుల్తాన్ పదాంసే అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీష్ నాటకాల పోటీలలో లక్ష రూపాయల బహుమతి పొందింది. ఈ నాటకాన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేసింది వీరి అబ్బాయి శ్రీవంశీ మట్టా. 
  2. దేవుడిని చూసినవాడు, మంచుపల్లకి, దుర్గమ్మ కూతురు, ఆటోగ్రాఫ్ ప్లీజ్ కథలు కన్నడంలోకి అనువాదం చేయబడ్డాయి.
  3. నానాటి బతుకు అనే కథ కేంద్ర సాహిత్య అకాడమీ వారి ఒక తరం తెలుగు కథ కథా సంకలనంలో చోటు చేసుకుంది.  

సాహిత్య సేవలో భాగంగా కథలకు అందుకున్న బహుమతులు/పురస్కారాలు:

  1. 2020 సం॥లో రాసిన ‘క్షమాభిక్ష’ కథకు స్వాతి మాసపత్రిక ప్రతిష్ఠాత్మక అనిల్‌ అవార్డు రూ. 25000 లు లభించింది.
  2. 2020 సం॥లో నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌ వారి కథల పోటీలో ‘పోలేరమ్మ’ కథకు రూ. 15000 లు లభించింది.
  3. 2021 సం॥లో రాసిన ‘స్పందన’ కథకు మక్కెన రామసుబ్బయ్య అత్యున్నత కథా పురస్కారం లభించింది.
  4. అక్షరాల తోవ, పాలపిట్ట, సాహో, సహరి, షార్‌వాణి, విశాలాక్షి మొదలైన పత్రికల, సంస్థల ద్వారా కథా పురస్కారాలు లభించాయి.
  5. 2022 జాగృతి వాకాటి పాండురంగారావ్ స్మారక దీపావళి కథల పోటీలో ‘డిజైనర్ బేబి’ కథకు రెండవ బహుమతి వచ్చింది. 
  6. ముల్కనూరు గ్రంథాలయం బతుకమ్మ కథల పోటీలో 2023 లో ‘ఏలి ఏలి లామ సబక్తాని’ కథకు పదివేల రూపాయల బహుమతి లభించింది.

సాహిత్యం పై జరిగిన పరిశోధనలు:

  1. ఆంధ్రా యానివర్శిటీ విశాఖపట్నం నుంచి నరకబోయిన రాము అనే విద్యార్థి 2019 సం॥లో డాక్టర్‌ ఎమ్‌. సుగుణరావు హాస్య కథలు – పరిశీలన అనే అంశంపై ఎం.ఫిల్‌. సాధించారు.
  2. ఆంధ్రా యానివర్శిటీ విశాఖపట్నం నుంచి చింతల పరశురామయ్య అనే విద్యార్థి 2017 సం॥లో డాక్టర్‌ ఎమ్‌. సుగుణరావు కథా సాహిత్యంపై పిహెచ్‌డి చేసి పట్టా పొందారు.
  3. ఆంధ్రా యానివర్శిటీ విశాఖపట్నం నుంచి తాళ్ళూరి రవికిరణ్‌ అనే విద్యార్థి 2009 సం॥లో డాక్టర్‌ ఎమ్‌. సుగుణరావు కథలు`పరిశీలన అనే అంశంపై ఎం.ఫిల్‌. పొందారు.
  4. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం నుంచి నరకబోయిన రాము అనే విద్యార్థి 2023 సం॥లో డాక్టర్‌ ఎమ్‌. సుగుణరావు బహుమతి కథలు అనే అంశంపై పి.హెచ్. డి కొరకు 2023 లో సిద్దాంత గ్రంథాన్ని సమర్పించారు.

ఇంతవరకు వ్రాసిన నవలలు / సీరియల్స్: 

  1. 2002 లో ప్రియదత్త వార పత్రికలో త్రివేణి అనే నవల సీరియల్ గా వచ్చింది. 
  2. సాహో మాస పత్రికలో విశ్వశాంతి నికేతన్ అనే నవల సీరియల్ గా వస్తోంది. 
  3. పాంచజన్యం అనే నవల స్వాతి అనిల్ అవార్డు నవలల పోటీలలో సాధారణ ప్రచురణకు స్వీకరించబడింది. 

ఆధ్యాత్మిక వ్యాసాలు / కాలమ్స్:

  1. ఈనాడు అంతర్యామిలో 50 కి పైగా ఆధ్యాత్మిక వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. 
  2. సాహో మాస పత్రికలో నెల నెలా ‘మీరూ కథ రాయండి’ శీర్షికన ఔత్సాహికులకు కథలు ఎలా రాయాలో కాలమ్ నిర్వహిస్తున్నారు. 

వీరి సాహితి జీవితానికి స్పూర్తి: అన్నయ్య లేట్ శ్రీ ఎమ్. ఎస్. బాబూరావ్, ప్రముఖ రచయిత, జర్నలిస్ట్

కుటుంబం: శ్రీమతి – లేట్ డా. డి. చంద్రకళ. 

వీరి సాహితి ప్రయాణంలో తోడుగా నిలుస్తున్న చిరంజీవులు: శ్రీవంశీ & అపేక్ష; శ్రీహర్ష సాయి

అభిరుచి: జీవిత స్పర్శ కలిగిన కథలు చదవడం, రాయడం.

చిరునామా: డాక్టర్‌ ఎమ్‌. సుగుణరావు

ఫ్లాట్‌ నెం. 312, గ్రీన్‌ మీడోస్‌ అపార్ట్‌మెంట్స్‌

హోటల్‌ ఫెయిర్‌ ఫీల్డ్‌ మేరియట్‌ దగ్గర, మాధవధార ఉడా కాలనీ,

విశాఖపట్నం 530018.

సెల్‌: 9393129945, 9704677930

Email: rao[dot]suguna[at]yahoo[dot]co[dot]in

 

కథానిలయంలో సుగుణరావు గారి కథలు