Syed-Saleem

స్వపరిచయం:

పేరు: సయ్యద్ సలీం.

విద్యార్హత: భూభౌతిక శాస్త్రంలో యం. యస్సి (టెక్), ఆంధ్ర విశ్వవిద్యాలయం,

వాల్తేరు.

జన్మస్థలం: త్రోవగుంట గ్రామం, ఒంగోల్, ప్రకాశం జిల్లా

ఉద్యోగం: అడిషనల్ కమీషనర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ (రి)

చిరునామా: హౌస్ నం: 62, సన్షైన్ వ్యాలీ, బాలాజీనగర్, మల్లాపూర్ (V), R.C.I రోడ్, బాలాపూర్ (M), హైద్రాబాద్ – 500005

ఈ మెయిల్ : syed[dot]saleem54[at]gmail[dot]com

మొబైల్: 07588630243

కవితలు:

కాలేజీ రోజులనుంచే కవితావ్యాసంగం ప్రారంభమై, ఇప్పటివరకు నూట యాభైకి పైగా కవితలు వివిధ పత్రికల్లో అచ్చయినాయి. కొన్ని కవితలు కన్నడం, ఆంగ్ల భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి. మూడు కవితా సంపుటాలు వెలువడ్డాయి.

  1. నీలోకి చూసిన జ్ఞాపకం 1999
  2. ఆకులు రాలే దృశ్యం 2005
  3. విషాద వర్ణం 2013

 

కథలు:

ఇప్పటివరకు మూడువందలకు పైగా కథలు వివిధ దిన, వార, మాస పత్రికల్లో ప్రచురించబడ్డాయి. మొదటికథ ‘మనీషి’ 1980లో ఆంద్రభూమి వారపత్రికలో ప్రచురించబడింది. చాలా కథలకు బహుమతులొచ్చాయి. పలు కథలు ఇతర భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి. వీటిలో ప్రముఖంగా మానవత్వాన్ని గుర్తుచేసే కథలు, మంచితనాన్ని తట్టిలేపే కథలే ఎక్కువ. ఇప్పటివరకు పదకొండు కథాసంపుటాలు వెలువడ్డాయి.

  1. స్వాతి చినుకులు 1996
  2. నిశ్శబ్ద సంగీతం 1999
  3. రూపాయి చెట్టు … 2004
  4. చదరపు ఏనుగు … 2006
  5. రాణీగారి కథలు … 2008
  6. ఒంటరి శరీరం 2009
  7. రెక్కల హరివిల్లు 2011
  8. అంతర్గానం … 2014
  9. నీటి పుట్ట … 2017
  10. మాయ జలతారు… 2018
  11. నీడ 2023

రాణీగారి కథలు మతసామరస్యాన్ని చాటిచెప్పే కథలు. ముస్లిం మతస్థుడైన సైఫ్, సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రాణి ప్రేమించుకుని పెళ్ళిచేసుకుంటారు. ఆ క్రమంలో వాళ్ళకెదురైన సామాజిక, సాంస్కృతిక, వ్యావహారిక, మతపరమైన సమస్యలు… వాటిని సామరస్యపూర్వకంగా ఎదుర్కొని ఆదర్శజంటగా ఎలా నెగ్గుకొచ్చారో సున్నితమైన హాస్యాన్ని, సునిశితమైన వ్యంగాన్ని జోడించి చెప్పిన కథలివి. మతాలకతీతంగా ప్రేమనీ, మానవత్వాన్ని ఎలా బతికించుకోవచ్చో ఈ కథల్లో విశదపర్చటం జరిగింది. ఇవి మాటీవీలో సీరియల్గా 56 ఎపిసోడ్లలో ప్రసారం చేయబడ్డాయి. ఈ కథలు అనేక భారతీయ భాషల్లోకి తర్జుమా చేయ బడ్డాయి..

నవలలు:

ఇప్పటివరకు ముప్పయ్ నవలలు ప్రచురించబడ్డాయి. రెండో నవల ‘వెండి మేఘం’ తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాన్ని దక్కించుకుంది. ‘కాలుతున్న పూలతోట’ నవలకు 2010 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ‘అనూహ్య పెళ్ళి’ నవల ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వహించిన నవలల పోటీలో బహుమతి గెల్చుకుంది. ‘అనామిక డైరీ’ నవలకు ఆటా – నవ్య వీక్లీ సంయుక్తంగా నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి లభించింది. ‘మేధ 017’, ‘ఆపరేషన్ కైటిన్’, ‘గుహలో ఒకరోజు’, ‘అంగారక గ్రహం మీద అంతిమ విజయం’ నవలికలకు తానా – మంచి పుస్తకం సంయుక్తంగా నిర్వహించిన బాల సాహిత్యంలో నవలల పోటీలో బహుమతి లభించింది. ‘మిషన్ ఎపిటీసియా’ అనే నవలిక బాలల సైన్స్ ఫిక్షన్ నవలల పోటీలో 2022 సంవత్సరానికి ఉత్తమ నవలగా ఎంపికైంది.

అనువదించబడిన గ్రంథాలు:

  1. Ocean and other stories Dr. Bhargavi Rao and Mrs Sujatha Gopal
  2. Three dimensions and other stories Mrs Sujatha Gopal
  3. Silent storm – Dr.P. Jayalaxmi
  4. A dove from the hillock – Dr. P. Jayalaxmi
  5. Shadow of hood – S.V. Subba Rao
  6. A Desire for death – Saleem
  7. A ray of sunshine – Dr. P. jayalaxmi
  8. Seven steps to your heart – R.H. Saraswati
  9. Soaring on broken wings – Saleem
  10. Deserted flowers – Dr. Indira Bobbelapati
  11. Struggling to survive – Dr. Indrasena Reddy
  12. Devastation within – Dr. Indrasena Reddy
  13. Between the two skies – Dr. Indrasena Reddy
  14. Fall and rise of a tidal wave – Dr. Indrasena Reddy
  15. నయీ ఇమారత్ కే ఖండహర్ (హింది) – శ్రీమతి శాంత సుందరి
  16. సునహరీ ధూప్ (హింది) – శ్రీమతి శాంత సుందరి
  17. సునహరా బాదల్ (హిందీ) – డా. కొమ్మిశెట్టి మోహన్
  18. జంగల్ కె ఫూల్ (హిందీ) – డా. కొమ్మిశెట్టి మోహన్
  19. రేగిస్తాన్ కే ఫూల్ (హిందీ) – డా. కొమ్మిశెట్టి మోహన్
  20. దో ఆకాశ్ (హింది) – డా. కొమ్మిశెట్టి మోహన్
  21. సొనేరీ మేఘ్ (మరాఠి) – శ్రీ మకరంద కులకర్ణి
  22. తీన్ బాజు ఆణి ఇతర గోష్ఠి (మరాఠి) – శ్రీ కమలాకర్ ధారప్
  23. తలాక్ ఆణి ఇతర కథా (మరాఠి) – శ్రీ కమలాకర్ ధారప్
  24. రాణీచి గోష్ట్ (మరాఠి) – శ్రీ కమలాకర్ ధారప్
  25. మరణ్ దేతా కా కోయీ మరణ్ (మరాఠీ) – శ్రీ కమలాకర్ ధారప్
  26. ఉధ్వస్త ఆసియానా (మరాఠీ) – శ్రీ కమలాకర్ ధరప్
  27. మరణ కాంక్షె (కన్నడ) – శ్రీ జి. వీరభద్రగౌడ
  28. రాణి కథెగళు (కన్నడ) – శ్రీ జి. వీరభద్రగౌడ
  29. ఉరియతిరువ హూబన (కన్నడ) – శ్రీ జి. వీరభద్రగౌడ
  30. కాడువ కథెగళు (కన్నడ) – శ్రీ దేవకవి నా. ధనపాల
  31. జీవన్మృతరు (కన్నడ) – శ్రీ దేవకవి నా. ధనపాల
  32. మేధ 017 (కన్నడ) – శ్రీ దేవకవి నా. ధనపాల
  33. అపరాజిత (కన్నడ) – శ్రీ దేవకవి నా. ధనపాల
  34. కాడువ కథెగళు -2 (కన్నడ) – శ్రీ దేవకవి నా. ధనపాల
  35. ఆపరేషన్ కైటిన్ (కన్నడ) – శ్రీ దేవకవి నా. ధనపాల
  36. గుహయెల్లి ఒందు దిన (కన్నడ) – శ్రీ దేవకవి నా. ధనపాల
  37. అనామిక డైరీ (కన్నడ) – కస్తూరి
  38. అనూహ్య కళ్యాణ (కన్నడ) – కస్తూరి
  39. అన్వేషణ (కన్నడ) – కస్తూరి
  40. మరుభూమియ హూగలు (కన్నడ) – కస్తూరి
  41. అలెగళు నిలువుదిల్ల (కన్నడ) – కస్తూరి
  42. అరణ్య పర్వ (కన్నడ) – కస్తూరి
  43. నాళె బప్పుడు ఇందె బరలి (కన్నడ) – కస్తూరి
  44. మౌనరాగగళు (కన్నడ) – కస్తూరి
  45. అడవి దేవియ మదిల మక్కళు (కన్నడ) – కస్తూరి
  46. ఎరియుం పూన్తోట్టం (తమిళం) – శ్రీమతి శాంతాదత్
  47. రాణీయుం న్జానూం (మళయాళం) – శ్రీ ఎల్. ఆర్. స్వామి
  48. కత్తిఎరియన్న పూన్తోట్టం (మళయాళం) – శ్రీ ఎల్. ఆర్. స్వామి
  49. మౌనరాగంగళ్ (మళయాళం) – శ్రీ రాజీవన్ ముందియోడ్
  50. పంచేది (మళయాళం) – శ్రీ రాజీవన్ ముందియోడ్
  51. సలీంక నిర్వాచిత గల్ప (ఒరియా) – శ్రీ బంగాలి నందా
  52. జలుతిబ ఫూలొ బగీచ (ఒరియా) – శ్రీ బంగాలి నందా
  53. రాణిర కహాణి (ఒరియా) – శ్రీమతి కమలా సత్పతి
  54. సున్‌హలీ బాదల్ (ఒరియా) – శ్రీమతి కమలా సత్పతి
  55. ఖంగర్ కి ఇమారత్ (ఒరియా) – శ్రీమతి కమలా సత్పతి
  56. ధ్వంస తలర జీబన (ఒరియా) – శ్రీమతి కమలా సత్పతి
  57. మహా సాగర్ – అనన్యగల్ప (ఒరియా) – శ్రీమతి పున్య ప్రవాదేవి
  58. తినోతి పరిసర – అనన్యగల్ప (ఒరియా) – శ్రీమతి బినోదినిదాస్
  59. భంగా దేనారే ఉడిబా (ఒరియా) – శ్రీమతి బినోదినిదాస్
  60. పహాడా వూపరు కపోతా తై (ఒరియా) – శ్రీమతి బినోదినిదాస్

6.బంచిల పైన్ సంగ్రామ్ (ఒరియా) – శ్రీమతి బినోదినిదాస్

టీ.వీ. సీరియల్స్:

  1. “రాణిగారి కథలు” మా టీవీలో 56 ఎపిసోడ్లుగా ప్రసారమైనాయి. శ్రీ అక్కినేని కుటుంబరావు గారు దర్శకత్వం వహించారు.
  2. “సలీం కథలు” పేరుతో పదిహేను కథలు దూరదర్శన్ యాదగిరి ఛానెల్లో ప్రసారమైనాయి. శ్రీ శంకు గారు దర్శకత్వం వహించారు. వీటికి 2015 సంవత్సరానికి ఉత్తమ టీ వీ ఫిల్మ్ సీరీస్ కింద బంగారు నంది బహుమతి లభించింది.

అవార్డులు – బహుమతులు:

  1. “కాలుతున్న పూలతోట” నవలకు 2010 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
  2. “వెండి మేఘం” నవల ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్శిటీ, మహాత్మా గాంధీ యూనివర్శిటీ, తెలంగాణ యూనివర్శిటీ మరియు బెంగుళూరు యూనివర్శిటీల్లో యం.ఏ తెలుగు విద్యార్థులకు పాఠ్యపుస్తకంగా నిర్ణయించబడింది.
  3. “ఆరో అల్లుడు” కథకు బెంగుళూరు విశ్వవిద్యాలయంవారు ప్రచురించిన వరల్డ్ బెస్ట్ స్టోరీస్ రెండో సంపుటిలో స్థానం
  4. “వెండి మేఘం” నవలకు తెలుగు యూనివర్సిటీ “సాహితీ పురస్కారం” 2004
  5. అధికార భాషాసంఘం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి “భాషా పురస్కారం” 2003
  6. కథా రచనకు గాను తెలుగు యూనివర్సిటీ నుంచి ధర్మనిధి పురస్కారం 2003
  7. “రూపాయి చెట్టు” కథా సంపుటికి “మాడభూషి రంగాచారి స్మారక పురస్కారం” 2004
  8. ఢిల్లీ తెలుగు అకాడమీ నుంచి “రాష్ట్రీయ వికాస్ శిరోమణి” అవార్డు 2005
  9. నవలా రచనకు గాను “వాసిరెడ్డి సీతాదేవి సాహితీ పురస్కారం” 2007
  10. కథా రచనకు గాను “చాసో సాహిత్య పురస్కారం” 2008
  11. “కాలుతున్న పూలతోట” నవలకు “కొవ్వలి సాహితీ పురస్కారం” 2009
  12. “కాలుతున్న పూలతోట” నవల హిందీ అనువాదం ” నయీ ఇమారత్ కె ఖండహర్” కి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్, ఢిల్లీ వారి పురస్కారం
  13. “వెండి మేఘం” నవలకు వి. ఆర్. నార్ల సాహితీ పురస్కారం 2005
  14. నవలా రచనకు గాను విశాలాంధ్ర స్వర్ణోత్సవ పురస్కారం 2003
  15. రూపాయి చెట్టు, చదరపు ఏనుగు కథాసంపుటాలకు విశాల సాహితీ పురస్కారం 2008
  16. జ్యోత్స కళాపీఠం వారి ఉగాది పురస్కారం 2007
  17. ఆంధ్ర నాటక కళాసమితి నుంచి తటపర్తి వరలక్ష్మి స్మారక ఉగాది పురస్కారం 2011
  18. అభ్యుదయ ఫౌండేషన్, కాకినాడ నుంచి అభ్యుదయ సాహితీ పురస్కారం 2012
  19. కథారచనకు గాను పులికంటి సాహితీ సత్కృతి 2005
  20. మొజాయిక్ లిటరరీ అవార్డ్, విశాఖపట్నం 2018
  21. 2020 ముల్కనూరు కథల పోటీలో “అమృతం” కథకు ద్వితీయ బహుమతి
  22. 2021 ముల్కనూరు కథల పోటీలో “పడగ నీడ” కథకు ప్రత్యేక బహుమతి
  23. 2022 ముల్కనూరు కథల పోటీలో “సంకెళ్లు” కథకు ₹5,000 బహుమతి

 

సలీం సాహిత్యం మీద యం. ఫిల్ మరియు పిహెచ్. డి కోసం పరిశోధనలు:

  1. “సలీం నవలలు – ఒక పరిశీలన” అనే అంశం మీద పిహెచ్.డి విద్యార్ధిని: పి. గ్లోరి గైడ్: ప్రొ. కె. మునిరత్నం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి
  2. “వెండి మేఘం నవల – ముస్లింల సాంస్కృతిక జీవనం” అనే అంశం మీద యం. ఫిల్ విద్యార్థి: మొహమ్మద్ బాషా గైడ్: ప్రొ. ఎండ్లూరి సుధాకర్

పొ. శ్రీ. తెలుగు విశ్వవిద్యాలయం, బొమ్మూరు

  1. “కాలుతున్న పూలతోట నవల – పరిశీలన” అనే అంశం మీద యం. ఫిల్ విద్యార్థి: మోహన్

గైడ్: డా. విజయలక్ష్మి

సెంట్రల్ యూనివర్శిటీ, హైద్రాబాద్

  1. “వెండిమేఘం నవల – ఆవశ్యకత” అనే అంశం మీద యం.ఫిల్

విద్యార్థి: మహబూబ్ జాన్ గైడ్: ప్రొ. మహలక్ష్మి

కుప్పం విశ్వవిద్యాలయం, కుప్పం

  1. “సలీం కథల్లో వస్తువైవిధ్యం” అనే అంశం మీద యం.ఫిల్ విద్యార్థి: యం. నాగరాజు గైడ్: ప్రొ. శరత్ జ్యోత్స్నారాణి సెంట్రల్ యూనివర్సిటీ, హైద్రాబాద్
  2. “సలీం మైనారిటీ కథలు – స్త్రీల సమస్యలు” అనే అంశం మీద యం.ఫిల్ విద్యార్థి: సలీం బాషా ధులుప్ గైడ్: డా. తుమ్మల రామకృష్ణ

సెంట్రల్ యూనివర్శిటీ, హైద్రాబాద్

  1. “సలీం సమగ్ర సాహిత్యం – పరిశీలన” అనే అంశం మీద పిహెచ్. డి

విద్యార్థి: షేక్ హజీబ్ మీరా గైడ్: ప్రొ. వి. తిమ్మన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం, వాల్తేర్

  1. “హ్యూమనిజం ఇన్ సలీంస్ షార్ట్ స్టోరీస్” అనే అంశం మీద యం.ఫిల్

విద్యార్థి: బి.జె. గౌతం గైడ్: డా. సోన్‌బా ఎన్. సాల్వే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటి, హైదాబాద్

  1. “అబ్దుల్ బిస్మిల్లా ఔర్ సలీం కె సాహిత్య మే సామాజిక చిత్రణ్” అంశం మీద పిహెచ్.డి: విద్యార్థి: సంజయ్ కుమార్ ప్రజాపతి గైడ్: ప్రొ. శారద సుందరి భారతుల బెనారస్ హిందూ యూనివర్శిటీ
  2. “గుర్రపు డెక్క నవలలో పర్యావరణ స్పృహ సామాజికాంశాలు” అనే అంశం

మీద యం. ఫిల్ విద్యార్థి: యు.వి. చక్రవర్తి గైడ్: డా. మురళి

ప్రెసిడెన్సీ కాలేజ్, చెన్నయ్

11. “సలీం కథాసాహిత్యానుశీలన” అనే అంశం మీద పిహెచ్. డి విద్యార్థి: వి. పద్మ గైడ్: డా. యం. విజయశ్రీ నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూర్