TSA-Krishna Murthy

పరిచయం:

 టి.ఎస్.ఏ. కృష్ణమూర్తి పేరుతో రచనలు చేస్తున్న కృష్ణమూర్తి పూర్తి పేరు తొడిమెల్ల కృష్ణమూర్తి,

తండ్రి పేరు టి.ఎస్. ఆంజనేయులు.

వీరు ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలోని చల్లని పుణ్యభూమి మదనపల్లెలో 1950వ సంవత్సరంలో జన్మించారు.

తల్లిదండ్రులు శ్రీ టి.ఎస్. ఆంజనేయులు మరియు శ్రీమతి కమలాక్షి (కమలమ్మ) గార్లు. భార్య శ్రీమతి బి. కళావతమ్మ. పిల్లలు టి. శివభారతమూర్తి, ప్రసన్నలక్ష్మి. కోడలు ఎన్. కె. నిత్య, అల్లుడు కె. రెడ్డెప్ప. ముగ్గురు మనవళ్ళు, ఒక మనవరాలితో నిండు దిగువ మధ్య తరగతి జీవితం అనుభవిస్తున్నారు.

వృత్తిరీత్యా విశ్రాంత మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ గుమస్తా. ప్రవృత్తి రీత్యా రచయిత.

1968లో రాయడం మొదలుపెట్టారు. మొట్టమొదటి పెద్ద కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో మెడ్రాస్ కళానికేతన్ స్టూడియో వారి గేవా కలర్ చిత్రాలతో 1971లో ప్రచురితమైంది. 

కాస్త బాగా వ్రాయగల కథకుడుగా 1974 నుండి గుర్తింపు. 300 కథలు, 10 పెద్ద కథలు, ఆరు నవలలు, వందకు పైగా పరిచయాలు, వ్యాసాలు, ముందుమాటలు వ్రాసారు. వాటిలో 80 శాతం పైగా పత్రికలలో అచ్చయ్యాయి. తదుపరి గ్రంథ రూపాలు దాల్చాయి. ఇప్పటికి 20 గ్రంథాలు వెలువరించారు. కొన్ని కథలు, రెండు నవలలు కన్నడ భాషలోకి, కొన్ని కథలు ఆంగ్లభాషలోకి అనువదించబడినవి. కన్నడలో అనువదింపబడిన వీరి నవలలు గ్రంథ రూపాలుగా వెలువడి కర్నాటకలో ప్రసిద్ధిగాంచాయి.

2013 వరకు వెలువడిన వీరి రచనల మీద ఎస్వీ యూనివర్సిటీ నుండి శ్రీ ఏ. రమాకుమార్ యాదవ్ నాలుగు సంవత్సరాలు పరిశోధన సల్ఫి పీహెచ్.డి పట్టం పొందారు. 3 పురస్కారాలు పొందిన ఆయుధం నవల మీద చెన్నై యూనివర్సిటీ నుండి ప్రొఫెసర్ మాడభూషి సంపత్ కుమార్ గారి పర్యవేక్షణలో శ్రీ జి. శ్రీధర్ పిహెచ్. డి చేయుచున్నారు.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వారి ఉత్తమ గ్రంథ నవలా పురస్కారం, మరసం పురస్కారం, చిరసం పురస్కారం, భరత ముని ఆర్ట్స్ అకాడమీ వారి కళారత్న అవార్డు, డాక్టర్ కవిత స్మారక జాతీయ పురస్కారం (కడప), గోవిందరాజు సీతాదేవి సాహిత్య పురస్కారం.

(నెల్లూరు), కుప్పం రెడ్డమ్మ సాహిత్య పురస్కారం (చిత్తూరు), లలిత కళా పరిషత్ వారి పురస్కారం (అనంతపురం) మొదలైన పురస్కారాలు, అవార్డులు 30 వరకు పొందారు.

మదనపల్లె సాహితీ కళా వేదిక అధ్యక్షుడిగా మూడు సంవత్సరాల పాటు సేవలందించారు. ప్రజా చైతన్య స్రవంతి ఉపాధ్యక్షునిగా గత ఐదు సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. ప్రకృతిని ప్రేమించడం, సంగీతాన్ని ఆస్వాదించడం, మనుషుల్ని, సమాజాన్ని గూర్చి ఆలోచించడం వీరి హాబీలు.

చిరునామా:

టి.ఎస్.ఏ. కృష్ణమూర్తి

III-169-16, రామారావు కాలనీ,

బాపూజీ ఎలిమెంటరీ మున్సిపల్ స్కూల్ రోడ్డు,

మదనపల్లె – 517 326, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్

మొబైల్: 93472 98942, ఫోన్: 08571 – 221963

T.S.A. కృష్ణమూర్తి పుస్తకాలు:

  1. టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి కథలు (కథాసంపుటి) 2003 ప్రచురణ – కళా ప్రచురణలు, మదనపల్లె – 517325
  2. అడ్డదారులు (కథాసంపుటి) 2006 ప్రచురణ – జయంతి పబ్లికేషన్స్, హైదరాబాదు
  3. కొత్త బంగారులోకం (నవల) ఆంధ్రభూమి సీరియల్ (2004) మొదటి ముద్రణ 2006, రెండవ ముద్రణ 2010 – జయంతి పబ్లికేషన్స్, హైదరాబాదు
  4. కలువ విరిసింది (స్వాతి మాసపత్రిక అనుబంధ నవల – 1993) తదుపరి ప్రచురణ 2009, – జయంతి పబ్లికేషన్స్, హైదరాబాదు
  5. ఈ గాలి నాది . ఈ నేలనాది (కథాసంపుటి) 2010 ప్రచురణ. – జయంతి పబ్లికేషన్స్, హైదరాబాదు
  6. ఘటోద్గజపురం గాథలు (వ్యంగ్య హాస్య కథాసంపుటి) 2011 ప్రచురణ. – విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు
  7. దృశ్యకావ్యం (కథాసంపుటి) 2012 ప్రచురణ. – కళాప్రచురణలు, మదనపల్లె – 517 325
  8. చిత్తూరు జిల్లా – వందేళ్ళ కథాసారథులు (మొదటిభాగము) 2013 ప్రచురణ (ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన 30 మంది కథకుల సంపూర్ణ పరిచయాలు) – కళాప్రచురణలు, మదనపల్లె – 517325
  9. T.S.A. కథ-2012 (2012వ సం॥లో ప్రచురితమైన T.S.A. కృష్ణమూర్తి కథల సంపుటి) 2013 ప్రచురణ. – కళాప్రచురణలు, మదనపల్లె – 517 325
  10. T.S.A. కథ-2013 (2013వ సం॥లో ప్రచురితమైన T.S.A. కృష్ణమూర్తి కథలసంపుటి) 2014 ప్రచురణ – కళాప్రచురణలు, మదనపల్లె – 517 325
  11. T.S.A. కథ-2014 (2014వ సం.లో ప్రచురితమైన T.S.A. కృష్ణమూర్తి కథల సంపుటి) 2015 ప్రచురణ. – కళాప్రచురణలు, మదనపల్లె – 517325
  12. కలల రాజ్యం (డైరెక్టు నవల) 2015 ప్రచురణ. – కళాప్రచురణలు, మదనపల్లె – 517 325
  13. మీరు కథ వ్రాయాలనుకుంటున్నారా? (నూతన రచయితలకు ఓ గైడ్) 2015 ప్రచురణ.

– కళాప్రచురణలు, మదనపల్లె – 517325

  1. ఆయుధం (నది మాసపత్రిక వచన కావ్య నవలల పోటీలో బహుమతి పొందిన నవల) 2016 ప్రచురణ. – కళాప్రచురణలు, మదనపల్లె – 517 325
  2. T.S.A. కథ – 2016 (2016వ సంవత్సరంలో ప్రచురితమైన కృష్ణమూర్తి రచనల సంపుటి) 2019 ప్రచురణ. – కళాప్రచురణలు, మదనపల్లె – 517 325
  3. T.S.A. కథ 2017 (2017వ సంత్సరంలో ప్రచురితమైన T.S.A. కృష్ణమూర్తి రచనల సంపుటి) 2019 ప్రచురణ. – కళాప్రచురణలు, మదనపల్లె – 517 325
  4. సంపూర్ణ ఘటోద్గజపురం గాథలు హాస్య, వ్యంగ్య కథా సిరీస్ 2021 ప్రచురణ. – కళా ప్రచురణలు, మదనపల్లె – 517 325
  5. భయంలేని బ్రతుకు – (డైరెక్టు నవల) 2023 ప్రచురణ. – కళాప్రచురణలు, మదనపల్లె-517325
  6. కవలు దారి (కన్నడ నవల) (టి.ఎస్.ఏ కృష్ణమూర్తి ‘కొత్త బంగారులోకం’ నవలకు మైసూరుకు చెందిన ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి విజయ శంకరగారు చేసిన అనువాదనవల) 2020 ప్రచురణ.

– గీతా ఆన్ బిహాఫ్ ఆఫ్ సాహిత్య సుగ్గి, బెంగుళూరు-580072 ప్రచురణ.

  1. కమల అరలితు (కన్నడ నవల) (టి.ఎస్.ఏ కృష్ణమూర్తి ‘కలువ విరిసింది’ నవలకు మైసూరుకు చెందిన ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి జోష్యుల ప్రభాశాస్త్రి (దేవరకొండ ప్రభాశాస్త్రి) గారు చేసిన అనువాద నవల) 2023 ప్రచురణ. – జోష్యుల ఫ్యామిలీ ప్రచురణ, మైసూరు – 570009.

పురస్కారాలు:

  1. 1994లో ‘కలువ విరిసింది’ నవలకు స్వర్గీయ కుప్పం రెడ్డెమ్మ సాహిత్య సొసైటీ (చిత్తూరు) వారి అవార్డు
  2. మెక్సా ‘విశిష్టవ్యక్తి’ పురస్కారం, మదనపల్లెలో
  3. ఆంధ్రజ్యోతి ‘సీమ సాహిత్యరత్నం’ పురస్కారం (డా. కొత్వాలు అమరేంద్ర)
  4. అక్టోబర్ 1998లో రచన ‘కథాపీఠం’ పురస్కారం
  5. పీలేరు కల్చరల్ అకాడమీ పురస్కారం, పీలేరులో
  6. చి.ర.సం. (చిత్తూరు జిల్లా రచయితల సంఘం) పురస్కారం, చిత్తూరులో
  7. మ.ర.సం. (మదనపల్లె రచయితల సంఘం) పురస్కారం, మదనపల్లెలో
  8. చైతన్య భారతి పురస్కారం, మదనపల్లెలో
  9. కొడవలూరు బలరామయ్య ప్రోత్సాహక అవార్డు – నవశంఖారావం, నెల్లూరులో
  10. సోమేపల్లి సాహితీ పురస్కారం – రమ్యభారతి, విజయవాడలో
  11. సి.పి. బ్రౌన్ అకాడమీ, హైదరాబాదు వారి పురస్కారం ‘స్వాతి’ ద్వారా
  12. ‘కొత్త బంగారులోకం’ నవలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారి 2008 ఉత్తమ గ్రంథ పురస్కారం 8-2-2010 నాడు హైదరాబాదులో
  13. ‘ఆయుధం’ నవలకు శ్రీ అవ్వా వేంకట అప్పారావు వచన కావ్య సాహితీ పురస్కారం నది మాసపత్రిక సౌజన్యంతో తేదీ 7-9-2014 నాడు విజయవాడ ఘంటసాల ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాలలో
  14. మదనపల్లె ఫైన్ ఆర్ట్స్ అకాడమీవారి ‘సేవారత్న’ పురస్కారం 2014
  15. నాయుని ‘సాహితీమిత్ర’ పురస్కారం 2014
  16. భరతముని ఆర్ట్స్ అకాడమీ వారి ‘కళారత్న’ అవార్డు 2014
  17. హరివిల్లు, చిత్తూరు లలిత కళావేదిక ద్వారా శ్రీమతి కామాక్షీబాయి, శ్రీ నారాయణరావు స్మారక సాహితీ పురస్కారం 2015
  18. నందమూరి సాహితీ అవార్డు, మానస సాహిత్య అకాడమీ, విజయవాడ 2016
  19. ‘కలలరాజ్యం’ నవలకు స్వర్గీయ కుప్పం రెడ్డెమ్మ సాహిత్య సొసైటీ, చిత్తూరు వారి ఉత్తమ గ్రంథ పురస్కారం 15-4-2016 నాడు చిత్తూరులో
  20. మలిశెట్టి సీతారాం స్మారక (MSR) ఎడ్యుకేషనల్ సొసైటీ, గుర్రంకొండ ప్రత్యేక ఉగాది పురస్కారం 2017 (పలమనేరులో)
  21. తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి, పలమనేరు 6వ వార్షికోత్సవ పురస్కారం 2018
  22. డా॥ కవిత స్మారక జాతీయపురస్కారం-2017 ఆయుధం నవలకు-2018 (కడప)
  23. గోవిందరాజా సీతాదేవి సాహిత్య పురస్కారం 2017 ఆయుధం నవలకు – 2018 (నెల్లూరు)
  24. పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు గారి 126వ జయంతి సందర్భంగా తేది 25.5.2023 గురువారం నాడు అనంతపురం పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు లలితకళా పరిషత్ లో పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు అవార్డు
  25. ప్రజాచైతన్య స్రవంతి వారిచే జ్ఞానోదయా పాఠశాల (మదనపల్లె), సెంట్రల్ హాలులో 4.6.2023 ఆదివారంనాడు విశిష్ట సాహితీ సేవా పురస్కారం

రచనల మీద పరిశోధనలు:

  1. 1971 నుండి 2013 వరకూ వెలువడిన టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి కథలు, నవలలు, వ్యాసావళిల మీద శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి నుండి శ్రీ ఎ.శ్రీరామకుమార్ యాదవ్, ఎం.ఎ., టి.పి.టి. అను వ్యక్తి నాలుగు సంవత్సరాలు పరిశోధన జరిపి సిద్ధాంత గ్రంథం సమర్పించి 2015 లో పిహెచ్.డి. పొందారు.
  2. చెన్నయి విశ్వవిద్యాలయం నుండి ప్రొ. మాడభూషి సంపత్ కుమార్ గారి పర్యవేక్షణలో శ్రీ జి. శ్రీధర్ గారు ‘ఆయుధం’ నవల మీద పిహెచ్.డి. చేయుచున్నారు.

ఇంటర్నెట్లో పుస్తకాలు/కథలు:

సంపూర్ణ ఘటోద్గజపురం గాథలు

టి . ఎస్ . ఏ . కృష్ణమూర్తి గారు | గమనం | కథ – 20

6-2-5 : కథ – టి.ఎస్.ఏ కృష్ణమూర్తి